నిలబడి వాహనం నడిపే దృశ్యం ఎప్పుడైనా చూశారా..! అదేంటి అనుకుంటున్నారా... ఈ వాహనం పేరు హైడ్రాలిక్ బ్రాంచ్ కటర్. దీని తొట్టెలో ఉన్న బటన్ల ఆధారంగా అందులో ఉన్న వ్యక్తే దీన్ని ముందుకు, వెనకకు, కిందకు, పైకి, పక్కకి నడపాలి. ఇలా ఎటుకావాలంటే అటు జరుపుకోవచ్చు. దీనిలో ఉన్న హైడ్రాలిక్ రంపంతో విద్యుత్ వైర్లకు అడ్డంగా పెరుగుతున్న చెట్ల కొమ్మలు తొలగించొచ్చు. నగర సుందరీకరణలో భాగంగా నిర్వహణకు ఈ యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు 25 అడుగుల ఎత్తు వరకూ వెళ్లగలదు. గంటల తరబడి ఎక్కువమంది చెయ్యాల్సినపనిని ఒక్కరే ఎంతో సులభంగా, వేగంగా చేయొచ్చు. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లో ఉన్న ఈ వాహనం ముత్యాలంపాడులో చెట్ల కొమ్మలను కత్తిరిస్తూ 'ఈటీవీ భారత్' కి కనిపించింది.
నిలబడి నడిపే వాహనాన్ని చూశారా..! - హైడ్రాలిక్ బ్రాంచ్ కటర్ వార్తలు
వాహనాన్ని నిలబడి ఎప్పుడైనా నడిపారా..? అదేంటి అనుకుంటున్నారా...! అవునండోయ్ ...హైడ్రాలిక్ బ్రాంచ్ కటర్ వాహనాన్ని అలానే నడపాలి. ఇంతకీ ఇది ఎక్కడ కనబడిందో తెలుసా..? చూడండి.
హైడ్రాలిక్ బ్రాంచ్ కటర్