ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్ నుంచి ఒడిశాకు సైకిల్​పై ప్రయాణం - hyderabad to orissa by cycle latest news vijayawada

లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. ఉన్నచోట ఉపాధిలేక తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొందరు కాలినడకన వెళ్తుంటే మరికొందరు సైకిల్ పై ప్రయాణం చేస్తున్నారు.

workers going to orissa
workers going to orissa

By

Published : May 9, 2020, 4:57 PM IST

తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఒడిశాకు వలస కార్మికులు సైకిల్ పై బయల్దేరారు. మార్బుల్ పని చేసే యువకులు... కరోనా వ్యాప్తి కారణంగా గత 45 రోజులుగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వేరే మార్గం లేక సైకిల్ పై ఆదివారం ఉదయం హైదరాబాద్ లో బయలు దేరారు.

ఆఐదుగురు యువకులు శుక్రవారం రాత్రి విజయవాడ రామవరప్పాడుకు చేరుకున్నారు. తమ గమ్య స్థానం ఒరిస్సాకు ఇంకా 750 కిలోమీటర్లు ప్రమాణం చేయాల్సి ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న కారణంగా... రాత్రిపూట మాత్రమే ప్రయాణం చేస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details