కోటిన్నరకుపైగా జనాభా గల భాగ్యనగరంలో నిత్యం వేలాది టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నిర్వహణకు.. కోట్లు ఖర్చు చేస్తున్నా స్వచ్ఛ హైదరాబాద్ కల మాత్రం సాకారం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ ప్రభుత్వాలే చేయాలనే ధోరణి మంచి కాదని.. ప్రజల సహకారమూ తోడవ్వాలంటోంది.. మోతీనగర్‌కు చెందిన సాహితీ స్నిగ్ధ. ఆ దిశగా తన వంతుగానూ కృషి చేస్తోంది.
గ్రీన్ టెక్నాలజీస్‌లో మాస్టర్స్..
చిన్నతనం నుంచే ప్రకృతి, పర్యావరణంపై సాహితీకి ప్రత్యేకాభిమానం. ఆ ప్రభావంతోనే ఇంజినీరింగ్ తర్వాత కాల్నిఫోరియా విశ్వవిద్యాలయం నుంచి గ్రీన్ టెక్నాలజీస్‌లో మాస్టర్స్ చేసింది. అమెరికా, కెన్యా, దుబాయ్ దేశాల్లోని పలు సంస్థల్లో పునరుత్పాదక శక్తి వనరుల వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసింది. ఎన్జీవోలు, ప్రభుత్వ సంస్థలతో కలిసి వాతావరణ మార్పులు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేసింది.
వేస్ట్ వెంచర్స్ ఇండియా సంస్థలో మేనేజర్‌గా..
విదేశాల నుంచి 2018లో హైదరాబాద్‌కు చేరుకున్న సాహితీ స్నిగ్ధ వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తున్న వేస్ట్ వెంచర్స్ ఇండియా సంస్థలో మేనేజర్‌గా చేరింది. ఈ సంస్థ నగరంలోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యునిటీల్లో ఆహార వ్యర్థాల నిర్వహణపై శిక్షణనిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పాఠశాలల్లో వ్యర్థాలను వేరు చేయడంపై అవగాహన కల్పిస్తుంది. ఈ సంస్థల్లో చురుగ్గా పనిచేసిన సాహితీ.. మూడేళ్లల్లోనే సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంది.
జీరో వేస్టేజ్ పట్టణంగా..
ఈ యువతి నేతృత్వంలోనే.. అపార్టుమెంట్లు విడిచి పట్టణ ప్రాంతాల్లోని వ్యర్థాల సమస్యల పరిష్కారానికి ముందుకు కదలింది వేస్ట్ వెంచర్స్ ఇండియా. అలా జీరో వేస్టేజ్ పట్టణంగా తయారుచేయాలనే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పురపాలకలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. గండిపేట వెల్ఫేర్ సొసైటీతో సహకారంతో ఖానాపూర్ గ్రామ డంపింగ్ యార్డ్ బాధ్యతలు తీసుకుంది సాహితీ.
రోజుకు 2 టన్నుల వ్యర్థాలు..