ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోయిన్​పల్లిలో కిడ్నాప్ కేసు: కొండపల్లి యువకులు అరెస్ట్ - కొండపల్లిలో హైదరాబాద్ పోలీసులు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిందితురాలిగా ఉన్న కిడ్నాప్ కేసులో కొండపల్లికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్​ చేయటం చర్చనీయాంశంగా మారింది. అలాగే గుంటూరుకు చెందిన మరో ఇద్దరు అన్నదమ్ములను ఈ కేసు విషయంపై గోవాలో అరెస్ట్​ చేశారు.

Bhuma Akhilapriya case
భూమా అఖిలప్రియ కేసులో కొండపల్లి యువకులు అరెస్ట్

By

Published : Jan 13, 2021, 1:28 PM IST

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. నిందితురాలిగా ఉన్న కిడ్నాప్ కేసుకు సంబంధించి.. కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన నలుగురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్​ చేశారు. గుంటూరుకు చెందిన వంశీ, సాయి అనే ఇద్దరు యువకులతో ఈ కేసుకు ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు సేకరించారు.

వీరితో పాటు మరికొందరు యువకులకు సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. వీరి కోసం అన్వేషించగా అన్నదమ్ములు గోవాలో ఉండగా... మిగిలిన వారు కొండపల్లిలో ఉన్నట్లు గుర్తించారు. వంశీ, సాయిలను గోవాలోనే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురిని.. కొండపల్లి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details