ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్​లో పేలుళ్ల కుట్ర కేసు.. తీగలాగుతున్న ఎన్ఐఏ - తెలంగాణ వార్తలు

Hyderabad Blasts Conspiracy Case Transferred to NIA: హైదరాబాద్​లో పేలుళ్లకు కుట్రకు సంబంధించి సిట్‌ నమోదు చేసిన కేసు ఆధారంగా గత నెల 25న ఎన్‌ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్​ పోలీసులు ఇప్పటికే జాహేద్​ ముఠాను అరెస్ట్​ చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్​ఐఏ కేసు నమోదు చేసింది.

ఎన్‌ఐఏ దర్యాప్తు
ఎన్‌ఐఏ దర్యాప్తు

By

Published : Feb 5, 2023, 4:01 PM IST

Hyderabad Blasts Conspiracy Case Transferred to NIA: పాకిస్తాన్​లోని ఉగ్రవాదుల ఆదేశాల మేరకు యువతను రిక్రూట్ చేసుకుని.. హైదరాబాద్​లో పేలుళ్లకు కుట్రపన్నిన అబ్దుల్ జాహేద్‌ కేసు ఎన్‌ఐఏకి బదిలీ అయింది. పేలుళ్ల కుట్రపై ఎన్​ఐఏ కేంద్ర హోంశాఖ ఆదేశాలతో కేసు నమోదు చేసింది. గతేడాది అక్టోబర్​లో సిట్‌ నమోదు చేసిన కేసు ఆధారంగా గత నెల 25న ఎన్‌ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. హైదరాబాద్​ పోలీసులు ఇప్పటికే జాహేద్​ ముఠాను అరెస్ట్​ చేశారు.

జాహేద్​, ఫారూఖ్, సమియొద్దీన్‌.. ఈ ముగ్గురు నిందితులు చంచల్​గూడ జైలులో రిమాంజ్​ ఖైదీలుగా ఉన్నారు. గతంలో వీరి నుంచి 4 హ్యాండ్ గ్రనేట్లు, 5.41లక్షల నగదు 5చరవాణులు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దసరా సందర్భంగా జాహేద్ పేలుళ్లకు కుట్ర చేశాడు. ఈ ముఠా పాక్​ నుంచి మనోహరాబాద్​కు హ్యాండ్​ గ్రనేడ్లు తరలించారు. జాహేద్​ అనుచరుడు మనోహరాబాద్​ నుంచి హైదరాబాద్​కు గ్రనేడ్లు తెచ్చాడు. 15 ఏళ్ల క్రితం టాస్క్​ఫోర్స్ కార్యాలయం పేలుడు ఘటనలో జాహేద్​ నిందితుడిగా ఉన్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details