కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఓ మహిళను అనుమానంతో ఆమె భర్తే దారుణంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన పట్టెబోయిన వెంకటరత్నం, శ్రీలక్ష్మిలకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానంతో ఉన్న వెంకటరత్నం రాత్రి భార్య శ్రీలక్ష్మితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న హనుమాన్ జంక్షన్ సీఐ వెంకటరమణ, వీరవల్లి ఎస్సై చంటిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త - మల్లవల్లిలో అనుమానంతో భార్యను చంపిన భర్త
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఓ మహిళను ఆమె భర్తే దారుణంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మల్లవల్లిలో అనుమానంతో భార్యను చంపిన భర్త
TAGGED:
అనుమానంతో భార్యను చంపిన భర్త