కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురంలో విషాదం నెలకొంది. ఒకేరోజు గంట వ్యవధిలోనే భార్యభర్తలిద్దరూ మృతిచెందారు. భార్య చనిపోయిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలోని బీసీ కాలనీలో 22 ఏళ్ల డేగల దేవీ రాజేశ్వరి ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త 30 ఏళ్ల పిచ్చయ్య పొలంలోకెళ్లి రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఇద్దరు పిల్లలున్నారు. చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒకేరోజు.. గంట వ్యవధిలోనే భార్యభర్త మృతి - మంగళాపురం నేర వార్తలు
భార్య చనిపోయిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరీద్దరూ ఒకేరోజు గంట వ్యవధిలోనే చనిపోడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురంలో జరిగింది.
భార్య చనిపోయిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్య