ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన - statue establishment programme padalavaripalem
కృష్ణాజిల్లా పాదాలవారిపాలెంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.

ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన
కృష్ణాజిల్లా, కోడూరు మండలం పాదాలవారిపాలెంలో ఆంజనేయస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండలానికి చెందిన భక్తులు... అధికారుల నిబంధనలకనుగుణంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ధర్మ భజన సేవా సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని విగ్రహ దాత శ్రీ తాత వెంకటేశ్వరావు తెలిపారు.