కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పునాదిపాడు పరిధిలో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలో అవకతవకలు జరిగినట్లు ప్రస్తుత ఏజీఎం మురళీకృష్ణ కంకిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్వేర్, పదిహేను లక్షల నగదు చోరీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కళాశాలలో గతంలో ఎగ్జిక్యూటివ్ డీన్‌గా పని చేసిన నరేంద్రబాబు మరో నలుగురు సిబ్బంది ఈ అవకతవకలకు పాల్పడ్డారని… మురళీకృష్ణ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
'రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్వేర్, రూ.15 లక్షలు చోరీ' - Manipulations in Sri Chaitanya educational institutions news
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పునాదిపాడు పరిధిలో ఉన్న శ్రీ చైతన్య విద్యాసంస్థలో అవకతవకలు జరిగినట్లు కంకిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. వంద కోట్ల విలువైన సాఫ్ట్వేర్, పదిహేను లక్షల నగదు చోరీ అయినట్లు ప్రస్తుత ఏజీఎం ఫిర్యాదులో పేర్కొన్నారు.
!['రూ.వంద కోట్ల విలువైన సాఫ్ట్వేర్, రూ.15 లక్షలు చోరీ' manipulations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-vlcsnap-2021-05-30-13h19m56s803-3005newsroom-1622361049-947.jpg)
శ్రీ చైతన్య విద్యాసంస్థలో అవకతవకలు
నరేంద్రబాబు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గోసలైట్స్ కోచింగ్ సెంటర్లో… తమ కాలేజీ విద్యార్థులను చేర్పించాలని వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారని మురళీకృష్ణ ఆరోపిస్తున్నారు. చోరీ చేసిన సాఫ్ట్వేర్, నగదు తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. మురళీ కృష్ణ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గారావు తెలిపారు.
ఇదీ చదవండి:'రైతుభరోసా కేంద్రాలకు ఇంటర్నెట్ కనెక్షన్'