కృష్ణా జిల్లా మైలవరంలో హ్యూమన్ రైట్ మిషన్ సంస్థ మహిళా విభాగం నూతన కార్యాలయ భవనం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక నూజివీడు రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో మానవ హక్కుల మిషన్ అధ్యక్షుడు కంచర్ల జాన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పౌరుడు కి సమాజంలో రాజ్యాంగం కల్పించే హక్కుల ను చట్టబద్ధంగా అందించేందుకు ఈ సంస్థ ద్వారా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
హ్యూమన్ రైట్ మిషన్ మహిళా విభాగానికి తనను అధ్యక్షురాలిగా నియమించినందుకు కోయా సుధా కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల హక్కుల సాధనకై తన వంతు కృషి చేస్తానని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల మిషన్ సభ్యులు, మదర్ థెరీసా మహిళా మండలి మహిళలు పాల్గొన్నారు.