ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రక్షించండి రక్షించండి.. ఆంధ్రప్రదేశ్​ను రక్షించండి' - బెంజి సర్కిల్​లో మానవహారం

రాజధాని ప్రజల ఆందోళనలు 12వ రోజుకు చేరాయి. అమరావతి విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇవాళ కూడా ప్రజలు రోడ్డెక్కారు.

human denominator in benz circle vijayawada for support of amaravathi farmers
బెంజి సర్కిల్​లో మానవహారం

By

Published : Dec 29, 2019, 8:56 AM IST

బెంజి సర్కిల్​లో మానవహారం

అమరావతి పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రాజధాని రైతులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. రాజధాని పరిధిలోని గ్రామాల రైతుల ఆందోళనలకు మద్దతుగా... కృష్ణా జిల్లాలో ప్రజలు ధర్నాలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ తీరును నిరసించారు. ''రక్షించండి రక్షించండి.. ఆంధ్రప్రదేశ్​ను రక్షించండి, జై అమరావతి, వన్ స్టేట్ వన్ క్యాపిటల్, 3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు'' అంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details