కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గారికపాడు వద్ద (రాష్ట్ర సరిహద్దు) బుధవారం రాత్రి భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. తెలంగాణ నుంచి వచ్చే వాహనాలను మధ్యాహ్నం నుంచి పూర్తిగా నిలిపివేయటం వల్ల రాత్రికి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విద్యాసంస్థల మూసివేతతో హైదరాబాద్ నుంచి వస్తున్న విద్యార్థులు.. రాష్ట్ర సరిహద్దు వద్ద తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దశల వారీగా విద్యార్థులను పంపిన పోలీసులు ఇతర పౌరుల విషయంలో మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఆంధ్ర - తెలంగాణ సరిహద్దులో భారీగా వాహనాల రద్దీ - ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో భారీగా వాహనాలు
ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా జిల్లా గారికపాడు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దేశవ్యాప్త లాక్డౌన్తో తెలంగాణలోని ఆంధ్రావాసులు రాష్ట్రానికి తరలివస్తున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుకుంటున్న కారణంగా ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో వాహనాలు రద్దీ