ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చల్లపల్లిలో ప్రజల విశేష స్పందన.. 1137 మందికి వ్యాక్సినేషన్​ - vaccination news

కృష్ణా జిల్లా చల్లపల్లిలో టీకాకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆరోగ్య సిబ్బంది రికార్డు స్థాయిలో 1137 మందికి వ్యాక్సినేషన్​ నిర్వహించారు.

mega vaccination drive at challapalli
చల్లపల్లిలో ప్రజల విశేష స్పందన

By

Published : May 26, 2021, 5:44 PM IST

కృష్ణా జిల్లా చల్లపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన కొవిడ్​ కేర్​ సెంటర్​ వద్ద జనం బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, పోలీస్ శాఖ సహకారంతో వ్యాక్సినేషన్​ను విజయవంతంగా నిర్వహించారు.

రికార్డు స్థాయిలో 1137 మందికి ఒక్కరోజులోనే సిబ్బంది టీకా వేశారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించిన మండల వైద్యాధికారిణి డాక్టర్ కేవీ పద్మావతి, ఈఓ ఆర్డీ అశోక్, ఈవో సుకుమార్ ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందనను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details