రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 21,452 మందికి కొవిడ్ నిర్ధారణైంది. 11 జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. 89 మంది మరణించారు. మంగళవారం ఉదయం 9నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 90,750 నమూనాలను పరీక్షించగా వారిలో 23.63 శాతం మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 13,44,386కి, మరణాలు 8,988కి చేరాయి.తూర్పుగోదావరి, విశాఖపట్నం, అనంతపురం జిల్లాల్లో అత్యధికంగా కొత్త కేసులు వచ్చాయి.
50.94% పెరిగిన యాక్టివ్ కేసులు..
ఈ నెల ఒకటో తేదీ నుంచి బుధవారం వరకూ చూస్తే రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 50.94 శాతం మేర పెరిగింది. మే 1న 1,30,752 గా ఉన్న క్రియాశీలక కేసుల సంఖ్య బుధవారం నాటికి 1,97,370కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ కేసుల సంఖ్య 25,804గా ఉంది. ఇప్పటివరకూ అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,059 మరణాలు నమోదయ్యాయి. 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 19,095 మంది కరోనా నుంచి కోలుకున్నారు.