బ్యాంకు ఖాతాదారులకు టోకెన్లు... ఎండనుంచి ఉపశమనం - Mailavaram banks crowd news
కృష్ణా జిల్లా మైలవరంలో బ్యాంకుల వద్ద మహిళలు, రైతులు బారులు తీరటంతో అధికారులు బ్యాంకుల వద్ద టోకెన్ల పద్ధతిని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటింటాలని సూచించారు.
![బ్యాంకు ఖాతాదారులకు టోకెన్లు... ఎండనుంచి ఉపశమనం బ్యాంకు ఖాతాదారులకు టోకెన్లు... ఎండనుంచి ఉపశమనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7082670-48-7082670-1588756081868.jpg)
బ్యాంకు ఖాతాదారులకు టోకెన్లు... ఎండనుంచి ఉపశమనం
కృష్ణా జిల్లా మైలవరంలో బ్యాంకుల వద్ద మహిళలు, రైతులు బారులు తీరారు. ఫలితంగా బ్యాంకుల వద్ద ఏర్పడిన రద్దీని నివారించేందుకు టోకెన్లు అందజేస్తున్నారు. ఖాతాదారులకు క్రమ పద్ధతిలో లావాదేవీలు నిర్వర్తించే ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాధి ప్రభావంతో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించి, శానిటైజర్లు ఉపయోగించే సదుపాయాలు అందుబాటులో ఉంచారు.