ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. కొత్తగా 585 మందికి మహమ్మారి - ఏపీలో కరోనా వైరస్ కేసులు

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 585 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. కొవిడ్‌ కారణంగా నలుగురు మృతి చెందారు. దీంతో వైరస్​తో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,193కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. కొత్తగా 585 మందికి మహమ్మారి
రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. కొత్తగా 585 మందికి మహమ్మారి

By

Published : Mar 24, 2021, 4:34 PM IST

రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు.. కొత్తగా 585 మందికి మహమ్మారి

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజు వ్యవధిలో 585 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యారోగ్యశాఖ నిర్ధరించింది. 24 గంటల వ్యవధిలో 35వేల 66మందిని పరీక్షించగా....అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 128మంది కరోనా బారినపడ్డారు. గుంటూరు జిల్లాలో 99, విశాఖ జిల్లాలో 81, కృష్ణా జిల్లాలో 63 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తూర్పుగోదావరి జిల్లాలో మరో 42 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. కరోనా కారణంగా చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున 24 గంటల్లో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 251మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 8లక్షల 95వేల 121మంది కరోనా బారిన పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details