నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి(kakani govardhan reddy) భారీ కుట్ర పన్నారని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(somireddy chandramohan reddy) భగ్గుమన్నారు. ఆనందయ్య ఔషధం(anandaiah medicine)తో వ్యాపారానికి కాకాణి కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ఆనందయ్య మందు పేరుతో సెశ్రిత కంపెనీ వెబ్‌సైట్ సైతం తయారు చేసిందని.. ఇది అధికార పార్టీకి అత్యంత సన్నితమైందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెశ్రిత నిర్వహకులు అధికార పార్టీకి సన్నిహితులే..
సెశ్రిత నిర్వాహకులు కాకాణికి, వైకాపాకు అత్యంత సన్నిహితులని పేర్కొన్న సోమిరెడ్డి.. నకిలీ మద్యం తరహాలోనే నకిలీ వెబ్‌సైట్ రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔషధం ఒక్కో ప్యాకెట్‌ను రూ.167కి అమ్ముకునేందుకు పన్నాగం పన్నారని దుయ్యబట్టారు. ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో వెబ్‌సైట్‌ను పక్కన పెట్టారని వివరించారు.
సుమోటోగా కేసు పెట్టాల్సిందే..
ప్రభుత్వం వెంటనే స్పందించి కుట్రపై సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెబ్‌సైట్ సూత్రధారులు, పాత్రధారుల గుట్టు విప్పి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేసు నమోదు చేయకపోతే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తామని సర్కార్‌ను హెచ్చరించారు.
సర్కారే అనుమతిచ్చి అడ్డంకులు సృష్టిస్తోంది : ఏలూరి సాంబశివరావు