కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఓ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో స్థానిక కొల్లిపర సుబ్బారావుకు చెందిన ఇల్లు, హోటల్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
గ్యాస్ సిలిండర్ పేలి ఇళ్లు, హోటల్ దగ్ధం - fire accident news in rangannagudem
వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి... ఇంటితో పాటు హోటల్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.

houses and hotel burnt in Gas cylinder blast at rangannagudem in krishna district
లాక్డౌన్ కారణంగా హోటళ్ మూసేసి.. ఇంట్లో అల్పాహారం తయారుచేస్తుండగా ప్రమాదం జరిగిందని బాధితురాలు తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులంటున్నారు.
ఇదీ చదవండి:కుప్పకూలిన విమానం- ప్రమాదంలో ఇద్దరు మృతి