ఆమె ఓ గృహిణి... లాక్డౌన్ మెుదలు ఇల్లు దాటి బయటికి అడుగు పెట్టలేదు. అయినా ఆమెకు కరోనా సోకింది. ఇప్పుడు అదే సమస్యగా మారింది. అసలు ఆమెకు ఏ విధంగా కరోనా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణ శివారు తొర్రగుంటపాలెంలో జరిగింది.
తొర్రగుంటపాలెంలో ఓ గృహిణికి కరోనా పాజిటివ్ నిర్థరణ కావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మహిళ కుటుంబంతో పాటు బంధువులను క్వారంటైన్‌కు తరలించారు.
మెుదట జగ్గయ్యపేట పట్టణంలో దిల్లీ నుంచి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకటంతో చికిత్స అందించారు. మిగిలిన కుటుంబ సభ్యులను సైతం క్వారంటైన్‌కు తరలించారు. వారందరూ కరోనా నుంచి కోలుకోవటంతో ఇళ్లకు పంపేశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుతో పట్టణంలో మరలా అలజడి మెుదలయ్యింది. ముఖ్యంగా ఇంట్లోనే ఉండే ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందో అని అన్వేషిస్తున్నారు. జగ్గయ్యపేట పట్టణం సహా మండలం మెుత్తాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. అధికారులు డ్రోన్ కెమెరాలతో పరిశీలన చేస్తూ, పాజిటివ్ వచ్చిన ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు