ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం - minister perni nani news

పేదవాడి కల నేడు సాకారం అయిందని, తనకూ ఇల్లుంది అన్న భరోసాతో తలెత్తుకొని తిరిగే పరిస్థితిని సీఎం జగన్ కల్పిస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణాజిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాల్లో పలువురు రాజకీయ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

house sites distributing programme in ibrahimpatnam at krishna district
ఇబ్రహింపట్నంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం

By

Published : Dec 25, 2020, 6:37 PM IST

Updated : Dec 25, 2020, 9:34 PM IST

కృష్ణాజిల్లా ఇబ్రహింపట్నంలో నవరత్నాలు - పేదలందరికి ఇళ్ల పథకాన్ని మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 3వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పేదవాడి కల నేడు సాకారం అయిందని, తనకూ ఇల్లుంది అన్న భరోసాతో తలెత్తుకొని తిరిగే పరిస్థితిని సీఎం జగన్ కల్పిస్తున్నారని పేర్ని నాని తెలిపారు.

ఒక్క పైసా ఖర్చు, అప్పు లేకుండా సీఎం జగన్ ఇల్లు కట్టిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 17వేల కొత్త ఊళ్లను సీఎం జగన్ ఏర్పాటు చేయబోతున్నారని వెల్లడించారు. రూ.6800 కోట్లు విద్యుత్ , నీటిసరఫరాకే కేటాయించారని తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో.. 3లక్షల 3వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలిస్తామన్నారు. కొంతమంది కోర్టులో కేసులు వేసి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలని యత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

మొవ్వలో
కృష్ణా జిల్లా మొవ్వలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని.. పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్,వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రారంభించారు. మొత్తం 12 వేల 324 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు.

మోపిదేవిలో

రాష్ట్రంలోని ఇళ్లు లేని పేదప్రజల కల నిజమైన రోజని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. జిల్లాలోని మోపిదేవి మండలంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పేదల కోసం ముఠా నాయకుడిగా మరతానని అయన అన్నారు.

జగ్గయ్యపేటలో

జగ్గయ్యపేట పట్టణంలోని బలుసుపాడు రోడ్డులో గల హౌసింగ్ లేఔట్ - 2లో "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమంలో.. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు. పట్టణంలో 912 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

స్నేహలత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

Last Updated : Dec 25, 2020, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details