ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

House Prices Hike in Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తెగ పెరిగాయి.. - పెరిగి

House Prices Hike in Hyderabad : హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు బాగా పెరిగాయి. నిర్మాణ సామగ్రి ధరలతో పాటు డిమాండ్ కూడా పెరిగినందున 8 శాతం ఇళ్ల ధరలు పెరిగాయి. ఈ విషయాన్ని క్రెడాయ్, కోలియర్స్ ఇండియా, లియాసెస్ ఫోరాస్ సర్వే వెల్లడించింది. మరోవైపు వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు పెరుగుతున్నా, విక్రయాలపై ప్రతికూల ప్రభావమేమీ కనిపించడం లేదని తెలిపింది.

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తెగ పెరిగాయి..
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తెగ పెరిగాయి..

By

Published : Nov 17, 2022, 12:51 PM IST

House Prices Hike in Hyderabad: నిర్మాణ సామగ్రి ధరలతో పాటు గిరాకీ పెరిగినందున, దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల్లో సగటున 6 శాతం వృద్ధి కనిపిస్తోందని క్రెడాయ్‌, కోలియర్స్‌ ఇండియా, లియాసెస్‌ ఫోరాస్‌ సర్వే తెలిపింది. జులై-సెప్టెంబరులో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 8 శాతం పెరిగాయి. చదరపు అడుగుకి సగటు ధర రూ.9,266 పలుకుతోంది.

దిల్లీలో ధరలు గరిష్ఠంగా 14 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు సగటు ధర రూ.7,741గా ఉంది. కోల్‌కతాలో 12 శాతం పెరిగి, చ.అడుగు రూ.6,594గా పలుకుతోంది. అహ్మదాబాద్‌లో 11 శాతం, పుణేలో 9 శాతం, బెంగళూరులో 8 శాతం చొప్పున ధరలు పెరిగాయని నివేదిక వెల్లడించింది. చెన్నై, ముంబయిలలో ధరలు స్థిరంగా ఉన్నాయి. ముంబయిలో చదరపు అడుగు ధర రూ.19,485గా ఉంది. 2022 ప్రారంభం నుంచీ ఇళ్ల ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది.

కొవిడ్‌ పరిణామాల అనంతరం చాలామంది సొంతింటి కొనుగోలు కోసం ఆలోచిస్తున్నారని, ఫలితంగా గిరాకీలో వృద్ధి కనిపిస్తోందని క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు హర్ష్‌ వర్ధన్‌ పటోడియా తెలిపారు. లీయాసెస్‌ ఫోరాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పంకజ్‌ కపూర్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం అమ్మకాలు గతంతో పోలిస్తే 16శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు పెరుగుతున్నా, విక్రయాలపై ప్రతికూల ప్రభావమేమీ కనిపించడం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details