ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలిచిన ఇళ్ల నిర్మాణం...లబ్ధిదారుల ఆందోళన - కృష్ణా జిల్లాలో నిలిచిన ఇళ్ల నిర్మాణం

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని జీప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం ఏడాదిన్నరగా నిలిపేశారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 240 మందికి మాత్రమే ఇళ్లను కేటాయించి మిగిలిన 1,152 మందికి మెుండిచేయి చూపించటం పట్ల నిరాశకు గురవుతున్నారు.

నిలిచిన ఇళ్ల నిర్మాణం
నిలిచిన ఇళ్ల నిర్మాణం

By

Published : Nov 23, 2020, 8:19 PM IST

కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ పరిధిలోని హనుమంతుపాలెంలో గత ప్రభుత్వం 22 ఎకరాల్లో ప్రారంభించిన జీప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం ఏడాదిన్నరగా నిలిపేశారు. కేవలం ఐదు బ్లాకుల్లో మాత్రమే సగం నిర్మాణ పనులు జరిగాయి. టిడ్కో ఆధ్వర్యంలో ఎల్అండ్​టీ సంస్థ ఈ నిర్మాణాలు చేపట్టింది. ప్రస్తుతం చేపట్టిన 5 బ్లాకుల్లోని 240 గృహాలను మాత్రమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గత ప్రభుత్వ హయాంలో 1,392 మందికి జీప్లస్ త్రీ గృహాలను మంజూరు చేసింది. ప్రస్తుతం 240 మందికి వీటిని కేటాయించి మిగిలిన 1,152 మందికి సెంటు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనాసాగరం వద్ద కొనుగోలు చేసిన 20 ఎకరాల భూమిలో వీరికి స్థలాలు ఇవ్వనున్నారు. ఫ్లాట్ వస్తుందని ఆశతో రెండేళ్ల క్రితం తమ వంతు వాటాగా డబ్బులు చెల్లించిన 1,152 మంది లబ్ధిదారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. తాము చెల్లించిన డబ్బులు ఇవ్వకపోగా... పట్టణానికి దూరంగా ఉన్న స్థలాలను కేటాయిస్తామనటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details