'రెండో దశలో అతివేగం.. ప్రాణవాయువు నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలి' కరోనా రెండో దశలో వైరస్ అతివేగంగా రూపాంతరం చెందుతోందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఫలితంగా ఆక్సిజన్ అవసరం ఒక్కోసారి 5 నుంచి 15 లీటర్లకు మారుతుందని పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సకు ప్రాణ వాయువు సరఫరా కీలకంగా మారుతుందన్నారు. ప్రాణ వాయువు వినియోగం అంచనా వేయడం కష్టంగా మారుతుందని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇన్ఫెక్షన్కు గురైన తర్వాతే..
కొవిడ్ సోకిన బాధితుల్లో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురైన తర్వాతే అధిక శాతం రోగులు ఆస్పత్రులను సంప్రదిస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమంగా మారతుందన్నారు. ఆక్సిజన్ నిల్వల నిర్వహణ, ప్రాణవాయువు అవసరాలు, సమర్థ వినియోగంపై వైద్య సిబ్బంది అందరికీ అవగాహన ఉండాలని అంటున్న డా.బూసిరెడ్డి నరేంద్రరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చూడండి:
కరోనాను జయించిన వారి ఊపిరితిత్తులు, మెదడులో గడ్డలు!