ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం గారూ స్పెషల్​ పర్పస్​ వెహికల్​ ఏర్పాటు చేయరూ...!' - అగ్రిగోల్డ్​ బాధితుల వార్తలు

అగ్రిగోల్డ్​ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్​ని కోరారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాగల ఐఏఎస్ లేదా డీజీపీ హోదా కలిగిన అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేయాలన్నారు

అగ్రిగోల్డ్ బాధితులకు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కావాలంటున్న అగ్రిగోల్డ్​ సంఘం గౌరవాధ్యక్షులు

By

Published : Nov 6, 2019, 8:01 PM IST

అగ్రిగోల్డ్​ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాగల ఐఏఎస్ లేదా అడిషనల్ డీజీపీ హోదా కలిగిన ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు గుంటూరులో రూ.10 వేల లోపు బాధితులకు చెక్కుల పంపిణీ చేపట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదికగా సీఎం జగన్​ స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు ప్రకటన చేయాలని కోరారు. గత 5 ఏళ్లుగా బాధితుల తరఫున చేస్తోన్న పోరాట ఫలమే రేపు గుంటూరులో చెక్కుల పంపిణీ అన్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details