దేశ స్వాతంత్ర్య సాధనలో ఆంధ్ర ప్రాంత ప్రజల పాత్ర కీలకమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీజీ 150వ జయంత్యుత్సవాల నేపథ్యంలో స్వాతంత్ర్యద్యమంలో పాల్గొన్న ముగ్గురు యోధులను గవర్నర్ సన్మానించి జ్ఞాపికలు అందచేశారు. ఆత్మీయ కలయికను ఓ సామాజిక కలయికలా అభివర్ణించిన గవర్నర్....ఐదేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించారు.
'స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రప్రాంత ప్రజల పాత్ర కీలకం' - governor bishwa bhushan harichandan latest
విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ముగ్గురు యోధులను సన్మానించారు.
స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రప్రాంత ప్రజల పాత్ర కీలకం: బిశ్వభూషణ్