పేదల నివాస సముదాయాల నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మచిలీపట్నం గోసంఘం వద్ద 70శాతం నిర్మాణాలు పూర్తయి... మధ్యంతరంగా నిర్మాణ పనులను నిలిపివేసిన జీ+3 భవనాలను లబ్ధిదారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నివాస స్థలాలు లేని 9400 మంది జీ+3 గృహాలు నిర్మించామని..., వాటిలో 4 వేల ఫ్లాట్ల నిర్మాణాలను పూర్తి చేసి లాటరీ ద్వారా కేటాయించామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం లబ్దిదారులకు ఫ్లాట్లు కేటాయించకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. గ్రామ వాలంటీర్లుగా నియమితులైన వైకాపా కార్యకర్తలు సూచించిన వారికే అధికారులు నివాస స్థలాలు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా దాష్టీకాలపై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు.
'వైకాపా కార్యకర్తలు సూచించిన వారికే నివాస స్థలాలు' - కొల్లు రవీంద్ర ఫైర్ ఆన్ వైసీసీ
కృష్ణా జిల్లా మచిలీపట్నం గోసంఘం వద్ద నిర్మితమవుతున్న జీ+3 నివాస సముదాయాలను లబ్ధిదారులతోకలిసి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. పేదల నివాస సముదాయాల నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర