విజయవాడ నగరవాసులకు తక్కువ ఖర్చులో హోమియో వైద్యం అందించేందుకు మొబైల్ వైద్యశాలను ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ప్రారంభించారు. కొవిడ్ సమయంలో మొబైల్ ద్వారా ప్రజలకు వైద్యం అందించటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. విజయవాడ చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఈ మొబైల్ వ్యాన్ ద్వారా వైద్య సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో చాలా ఏళ్ల నుంచి హోమియో వైద్యం అమలులో ఉందని ఆయన పేర్కొన్నారు.
విజయవాడలో హోమియో చికిత్స మొబైల్ వైద్యశాల ప్రారంభం.. - హోమియో వైద్యం
మొబైల్ వ్యాన్ ద్వారా హోమియో చికిత్స అందించే మొబైల్ వైద్యశాలను ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ ప్రారంభించారు. రానున్న రోజుల్లో వీటిని విజయవాడ చుట్టు పక్కల గ్రామాలకు సైతం విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో మొబైల్ ద్వారా ప్రజలకు వైద్యం అందించటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
విజయవాడలో హోమియో చికిత్స మొబైల్ వైద్యశాల ప్రారంభం