కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీవల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న దుర్గారావు స్థానికంగా ఉండే 150 మంది నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తూ.. తనకొచ్చే జీతంలో కొంత మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేస్తున్న దుర్గారావును పలువురు అభినందించారు.
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన హోంగార్డు - మోపీదేవి నేటి వార్తలు
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదల ఇబ్బందులను చూసి చలించిపోయాడు ఓ హోంగార్డ్. తనకొచ్చే కొద్దిపాటి జీతంతో పేదలకు సహాయం చేస్తూ మంచిమనసు చాటుకుంటున్నాడు.
పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన హోంగార్డు