లాక్డౌన్ కారణంగా అన్నం దొరక్కా ఆకలి బాధతో అలమటిస్తూ... రహదారులపై జీవిస్తున్న వారికి విజయవాడలో హిజ్రాలతో కలిసి పిళ్లా శివ మిత్ర బృందం అన్నదానం చేసి మానవత్వం చాటారు. హిజ్రాలు తాము తయారు చేసిన బిర్యాని, కుర్మా ప్యాకెట్లు, పిళ్లా శివ మిత్ర బృందం... అరటి పండ్లు, వాటర్ బాటిల్ అందించారు. చిట్టానగర్ వద్ద ఉన్న టన్నెల్లో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
విజయవాడలో హిజ్రాల అన్నదానం - about lockdown
సామాన్యంగా హిజ్రాలంటే ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. ఇందుకు భిన్నంగా రోడ్లపై ఉంటూ ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు హిజ్రాలు అన్నదానం చేశారు.
విజయవాడలో అన్నార్తులకు అన్నదానం చేసిన హిజ్రాలు