ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండాను పోలిన రంగులు వేసినందుకు.. వాటిని తొలగించేందుకు అయిన ఖర్చును రాబట్టాలని కోరుతూ డాక్టర్ మద్దిపాటి శైలజ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాలకు వేసిన రంగులు తీసేందుకు రూ. 4వేల కోట్లు ఖర్చు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనివల్ల ప్రజా ధనం వృథా అయిందని ధర్మాసనానికి తెలిపారు. వ్యాజ్యంలో సీఎస్, పంచాయతీ శాఖ కార్యదర్శి, కమిషనర్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ప్రతివాదులుగా ఎందుకు పేర్కొన్నారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు.. హైకోర్టులో విచారణ - ఏపీ హైకోర్టు
ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేసి, తీసినందుకు అయిన ఖర్చును రాబట్టాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగిందిి. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఏపీ హైకోర్టు