కొత్త వాహనానికి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నది నిబంధన. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014 నుంచి దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. నకిలీ నెంబర్ ప్లెట్ల ఏర్పాటు చేసి నేరాలకు పాల్పడటానికి అవకాశంలేకుండా దీని ఏర్పాటును తప్పని సరిచేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల బిగింపు వ్యవహారం.... సక్రమంగా జరగడం లేదు. వాహనదారులు ఎవరికి నచ్చిన నెంబర్ ప్లేట్ల వారు బయట తయారు చేయించుకుని వాహనాలకు ఏర్పాటు చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల ఏర్పాటు బాధ్యతను వాహనాల డీలర్లకే కట్టబెట్టారు. తొలుత అందరూ సక్రమంగానే వీటిని ఏర్పాటు చేశారు. క్రమంగా చాలా చోట్ల పలువురు డీలర్ల నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటు సక్రమంగా జరగడం లేదు. వాహనదారులు వారికి నచ్చినట్లు నెంబర్ ప్లేట్లు తయారు చేయించుకుంటున్నారు.
సెక్యూరిటీ నెంబర్ ప్లేటు అనేది ఒక సెక్యూరిటీ ఫీచర్ అండి. ఎందుకంటే... ఫేక్ వెహికిల్స్ బయటతిరగకుండా ఏదన్నా క్రైమ్‌లో ఇన్వాల్స్ అయి నెంబర్ ప్లేట్లు మార్చుకొని లేదా పోలీస్ ఛలాన్లు.. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ ఛలాన్స్ తప్పించుకునేందుకు వేరే నెంబర్ ప్లేట్స్ వేసుకోవడం... కొంతమంది ఏంటంటే.. ఆ స్టైలిష్ నేమ్‌కు అలవాటుపడి ఆ లెటర్లలో ఒక రకమైన దీని కోసం మార్చేస్తుంటారు. స్టైలిష్ లెటరింగ్ కోసం ఈ హైసెక్యూరిటీ ప్లేట్లను పక్కన పెట్టి వారికి నచ్చిన విధంగా చేయించుకుంటున్నారు. దీనిపైన మేం డ్రైవ్ కూడా చేపట్టడం జరగింది అక్టోబర్ ఒకటి నుంచి. ఇందులో భాగంగానే దాదాపు 2500 కేసులు కూడా నమోదు చేశాం.