ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు, మహిళల ఆందోళన.. విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144, పోలీస్‌యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు పోలీసులు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ, సమస్యాత్మక గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీఎం కాన్వాయ్ అసెంబ్లీకి చేరుకునే మార్గంలో గట్టి భద్రత ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే మార్గంలో ఇప్పటికే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
సీఎం జగన్ కాన్వాయ్ ట్రయల్ రన్ - ఏపీ అసెంబ్లీ సమావేశాలు
రేపటి మంత్రివర్గం, అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా సీఎం జగన్ నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
high-security in amaravati
Last Updated : Jan 19, 2020, 5:58 PM IST