కృష్ణా జిల్లా చల్లపల్లి రైతు బజారులో బోర్డుపై రాసిన ధరకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. వంకాయ గుడ్రం రకం రేటు బోర్డుపై లేదని రైతు బజారు అధికారిని అడిగితే... ఈరకం వంకాయలు రావడం లేదని, అందుకే రేటు రాయడం లేదని అంటున్నారు. కానీ కేజీ గులాబీరకం వంకాయ రూ.12 అమ్మగా... గుడ్రం రకం వంకాయ కేజీ రూ.20 అమ్ముతున్నారు.
ధరలు అధికం.. చర్యలు శూన్యం..! - చల్లపల్లి రైతు బజారు ధరల వార్తలు
రైతు బజార్లో అడిగితే ఆ రకం వంకాయలే లేకపోవడంతో... ధరల బోర్డుపై రాయలేదని అధికారులంటున్నారు. కానీ వాస్తవంగా వాటిని... సాధారణ రేటుకన్నా అధికంగా అమ్ముతున్నారు. ఇలా అనేక కూరగాయల విషయంలో జరుగుతోందని కొనుగోలుదారులు వాపోతున్నారు.

High prices at challapalli raithu(farmer) bazar in krishna district
రైతు బజారులో ఇలా అనేక కూరగాయల రేట్లు ఎక్కవచేసి అమ్ముతున్నప్పటికీ.. అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై కొనుగోలు దారులు పశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:కరోనా విజృంభన.. కార్మికనగర్‌లో కఠిన ఆంక్షలు