కోర్టు దిక్కార కేసులో నోటీసులు పంపకుండానే వకాల్తా దాఖలు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నోటీసులు పంపకుండా వకాల్తా తీసుకున్న కోర్టు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. కృష్ణాజిల్లా మొవ్వ మండల డిప్యూటీ తాహసీల్దార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో కోర్టును ఆశ్రయించారు.
HIGH COURT : 'కోర్టు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి' - high court news
కోర్టు దిక్కార కేసులో నోటీసులు పంపకుండానే వకాల్తా దాఖలు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నోటీసులు పంపకుండా..వకాల్తా తీసుకున్న కోర్టు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
హైకోర్టు
విచారణ జరిపిన కోర్టు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశించినా సమాచారం ఇవ్వకపోవడంతో న్యాయవాది కే.తులసీదుర్గాంబ కోర్టు దిక్కార పిటిషన్‌ను దాఖలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా వకాల్తా ఎలా దాఖలు చేస్తారని హైకోర్టు నిలదీసింది. బేషరతుగా కోర్టు సిబ్బంది క్షమాపణ తెలిపారు. తదుపరి విచారణ వాయిదా వేసింది.
ఇదీ చదవండి:HIGH COURT: కోర్టు ధిక్కరణ కింద... ఆ తహసీల్దార్‌కు ఆరు నెలల జైలు శిక్ష