మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, వ్యవస్థాపక కుటుంబ సభ్యుల నియామకాలపై... ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ... దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులని కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజు, వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా ఊర్మిల గజపతిరాజు, ఆర్వీ సునీత ప్రసాద్‌లను నియమిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఆదేశాలపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు.
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం.. విచారణ ఏప్రిల్ 9కి వాయిదా
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా సంచైత గజపతిరాజు నియామకంపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రతివాదులు, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా