రిజిస్టర్ దస్తావేజుల ద్వారా తమకు విక్రయించిన 4,731 ఎకరాల భూమిని ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ.. కృష్ణపట్నం ఇన్ప్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ నెల 19న ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ( ఏపీఐఐసీ ) జారీ చేసిన లేఖను రద్దు చేయాలని కోరుతూ.. ఆ సంస్థ తరఫున చీఫ్ ఫైనాన్షియల్ అధికారి కె . గౌరి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నెల్లూరు జిల్లాలోని కోట , చిల్లకూరు మండలాల పరిధిలోని తమకు చెందిన 4,731 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని నిలువరించాలని పిటిషన్లో కోరారు. ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు,పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చారు.
'కృష్ణపట్నం భూములపై విచారణ ఈ నెల 29కి వాయిదా' - High court on krishna patnam lands
ప్రభుత్వంపై కృష్ణపట్నం ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
కృష్ణపట్నం భూముల వ్యాజ్యంపై ... నేడు హైకోర్టులో విచారణ
Last Updated : Oct 25, 2019, 4:36 PM IST