ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్ - government

సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియామకం జరిగిందని.. ప్రకాశం జిల్లాకు చెందిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్

By

Published : Apr 24, 2019, 4:00 AM IST

డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియామకంపై 2018 జూన్ 30న జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ప్రకాశం జిల్లాకు చెందిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని తెలిపారు. వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేసింది. పిటిషనర్ తరుపున న్యాయవాది శశిభూషణ్ తన వాదనలు వినిపించారు. 2006 సెప్టెంబరు 22న ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా డీజీపీ నియామకం జరిగిందన్నారు.

డీజీపీ నియామకంపై హైకోర్టులో పిటిషన్
డీజీపీగా నియమించే అధికారుల పేర్లు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీకి పంపాలన్నారు. సీనియార్టీ ప్రకారం పరిశీలించి యూపీఎస్సీ రాష్ట్రానికి పంపుతుందని.. కానీ ఆర్పీ ఠాకూర్ నియామకంలో ఆప్రక్రియ జరగలేదని న్యాయవాది వివరించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సవరణ చట్టం తెచ్చిందన్నారు. వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందన కోర్టు ఉత్తర్వులను అమలు చేయటానికి ప్రభుత్వానికి ఇబ్బందులుంటాయని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని తెలిపింది. అందువల్ల కేసును వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని... వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details