మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఈనెల 20కి వాయిదా వేశారు. వివిధ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ, సీబీఐ, తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తన భర్త వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా, అయిదుసార్లు వినతులు సమర్పించినా ఇప్పటివరకూ స్పందించలేదన్నారు. పది నెలల కావస్తున్న హత్యకు కారకులైన వారిని గుర్తించలేకపోయారని వైఎస్ సౌభాగ్యమ్మ హైకోర్టుకు నివేదించారు.
వివేకా కేసు సీబీఐకి ఇవ్వాలి.... సతీమణి సౌభాగ్యమ్మ వినతి - former mp ys vivekanandareddy murder case latest news in telugu
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఈనెల 20కి వాయిదా వేశారు. వివిధ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ, సీబీఐ, తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తదితరులకు నోటీసులు జారీ చేశారు.
![వివేకా కేసు సీబీఐకి ఇవ్వాలి.... సతీమణి సౌభాగ్యమ్మ వినతి high court hearing on ys vivekanandareddy murder case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5645209-849-5645209-1578533721822.jpg)
మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ 20కి వాయిదా