కూచిపూడి గ్రామంలో చేపల చెరువు లీజు ఆక్షన్పై దేవాదాయశాఖ ఇచ్చిన నోటీసును సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చేపల చెరువుకు లీజు ఆక్షన్ వేస్తామని దేవాదాయశాఖ ఇచ్చిన నోటీసులపై గ్రామ అభివృద్ధి సొసైటీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. చేపల చెరువు దేవాదాయశాఖ భూమి కాదని పిటిషనర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. నోటీసులు ఇచ్చే అధికారం దేవాదాయశాఖకు లేదని న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం నోటీసులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
చేపల చెరువుపై దేవాదాయశాఖ ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసిన హైకోర్టు - high court hearing on kuchipudi chepala cheruvu petition
కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో చేపల చెరువుపై దేవాదాయశాఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. చేపల చెరువుకు లీజు ఆక్షన్ వేస్తామని దేవాదాయశాఖ ఇచ్చిన నోటీసులపై గ్రామ అభివృద్ధి సొసైటీ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు
Last Updated : Mar 17, 2022, 9:26 AM IST
TAGGED:
హైకోర్టు వార్తలు