High Court inquiry into Finance Commission: ఫైనాన్స్ కమీషన్‌ను నియమించాలని కోరుతూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో విచారణ సందర్బంగా మూడు నెలల్లో ఫైనాన్స్ కమీషన్ నియమిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని... మూడు నెలలు దాటుతున్నా కమీషన్‌ను నియమించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
ఫైనాన్స్ కమీషన్ ఏర్పాటుపై హైకోర్టులో విచారణ.. ప్రభుత్వానికి 4 వారాలు గడువు - ఫైనాన్స్ కమీషన్‌పై హైకోర్టు విచారణ
High Court inquiry into Finance Commission: ఫైనాన్స్ కమీషన్‌ను నియమించాలని కోరుతూ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవి రెడ్డి వేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. గతంలో మూడు నెలల్లో ఫైనాన్స్ కమీషన్ నియమిస్తామని.. ప్రభుత్వం హామీ ఇవ్వగా... మూడు నెలలు దాటుతున్నా కమీషన్‌ను నియమించకపోవడంతో.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించి.. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.

ఫైనాన్స్ కమీషన్‌పై హైకోర్టు విచారణ.. ప్రభుత్వానికి 4 వారాలు గడువు
ఫైనాన్స్ కమీషన్ నియామకానికి సంబంధించిన ఫైల్... గవర్నర్ పరిశీలనలో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గవర్నర్ నుంచి ఆమోదం వచ్చిన వెంటనే ఫైనాన్స్ కమీషన్‌ను నియమిస్తామని తెలిపారు. 4 వారాలు సమయం ఇస్తున్నామని.. ఈలోపు కమీషన్‌ను నియమించాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: