మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. సత్తెనపల్లి నైపుణ్యాభివృద్ధి సంస్థలోని ల్యాప్టాప్లను శివరామకృష్ణ సూచనలతో కొందరు వ్యక్తులు తీసుకెళ్లారంటూ... ఆ సంస్థ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.
కోడెల కుమారుడికి హైకోర్టులో ఊరట..! - kodela son gets stay from high court in laptop issue
మాజీ సభాపతి, దివంగత నేత కోడెల కుమారుడు శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. ల్యాప్టాప్ అదృశ్య కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ... న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
![కోడెల కుమారుడికి హైకోర్టులో ఊరట..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4850939-963-4850939-1571885998649.jpg)
హైకోర్టులో కోడెల శివరామకృష్ణ కేసు విచారణ