సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను హైకోర్టు తప్పుపట్టినట్లు.. పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలని, జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. సస్పెన్షన్ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీతభత్యాలు చెల్లించలేదని పేర్కొంటూ.. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏబీవీ కేసులో తీర్పును ధర్మాసనం వాయిదా వేసింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీవీని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న జీవో జారీచేసింది. ఆ జీవోను కొట్టివేస్తూ 2020 మే 22న హైకోర్టు తీర్పు ఇచ్చింది. పిటిషనర్‌కు ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. దానిని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 22న కొట్టేసింది. హైకోర్టు ఆదేశించిన ప్రకారం సస్పెన్షన్ కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని పేర్కొంటూ C.S. సమీర్‌శర్మపై A.B.V.హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ కేసులో తీర్పు వాయిదా - ఏబీ వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు తీర్పు రిజర్వు
Senior IPS ABV case: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను హైకోర్టు తప్పుపట్టినట్లు.. పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఏబీవీని విధుల్లోకి తీసుకోవాలని, జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. సస్పెన్షన్ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీతభత్యాలు చెల్లించలేదని పేర్కొంటూ.. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ
Last Updated : Oct 28, 2022, 8:35 AM IST