కృష్ణాజిల్లా నాగాయలంక మండలం దీనదయాల్పురం గ్రామంలో రొయ్యల చెరువు యజమానులు వినూత్నంగా ఆలోచించారు. ఊరు బయట ఉన్న రొయ్యల చెరువులపై ప్రజల దృష్టి పడకుండా ఉండేందుకు... చెరువు చుట్టూ హీరోయిన్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రోడ్డుపై వెళ్లేవారు చెరువు గట్టుపై ఉన్న ఆ హీరోయిన్ల ఫ్లెక్సీలను ఆసక్తిగా గమనిస్తూ చెరువును చూడటం లేదని రొయ్యల చెరువు యజమానులంటున్నారు. అలాగే మరోవైపు దేవుళ్ల ఆశీస్సుల కోసం వేరే ఫొటోలను సైతం పెట్టారు. ఇదిలావుంటే... ఆ ఫ్లెక్సీలను చూస్తూ చాలామంది రోడ్లపై గుంటల్లో పడి దెబ్బలు తగిలించుకున్న వారు కూడా ఉన్నారని పలువురంటున్నారు.
గ్రామానికి వచ్చిన హీరోయిన్లు... ఎక్కడో తెలుసా..! - రొయ్యలచెరువుకు హీరోయిన్ల ఫొటులు
గతంలో కొత్తగా నిర్మించిన ఇళ్లైనా.. కొత్త వస్తువులు కొనుగోలు చేసినా అందరీ దృష్టి పడకుండా ఉండేందుకు దిష్టిబొమ్మలు కట్టేవారు. అలాగే పంట పొలాల్లో ఐతే ఒక కర్రకు మట్టికుండ తగిలించేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. కొంతమంది వినూత్నంగా ఆలోచించి తమ పొలాల చూట్టూ అందమైన హీరోయిన్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
![గ్రామానికి వచ్చిన హీరోయిన్లు... ఎక్కడో తెలుసా..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5119292-1052-5119292-1574237587389.jpg)
heroins-pics-used-to-francs-pond-in-krishna-district
Last Updated : Nov 20, 2019, 1:47 PM IST