ప్రజా సమస్యల సత్వర పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి.. సామాన్యులే కాదు.. ప్రముఖులూ వస్తున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి.. సినీ నటుడు వడ్డే నవీన్ వచ్చారు. భూ సేకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తమ భూమికి.. పరిహారం చెల్లించాలంటూ సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. నూజివీడు పరిధిలోని తిరువూరు నియోజకవర్గం మాధవరం గ్రామంలో తన తల్లికి భూమి ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చారు. ఇంతవరకూ పరిహారం అందలేదన్నారు.
'స్పందన'కు వడ్డే నవీన్.. పరిహారం కోసం విజ్ఞప్తి - cine hero naveen complaint in spandana event for land issue
సినీ నటుడు వడ్డే నవీన్.. కృష్ణా జిల్లా నూజివీడులోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి వచ్చారు. తన తల్లికి సంబంధించిన భూమిని సేకరణలో భాగంగా అధికారులు తీసుకున్నారని.. ఇంతవరకూ ఎలాంటి పరిహారం అందలేదని తెలిపారు.

స్పందన కార్యక్రమం
పరిహారం అందించాలని వినతి పత్రం ఇచ్చిన సినీ హీరో నవీన్
ఇదీ చూడండి:
TAGGED:
sapndana event in nuzuvid