కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్దవరంలోని కేర్ అండ్ షేర్ అనాథ శరణాలయంలో హీరో నిఖిల్ పుట్టినరోజు వేడుకను నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా కారణంగా ఈసారి ఎలాంటి పార్టీలు లేకుండా అవసరమైన వారికి ఏదైనా సహాయం చేద్దామన్న నిఖిల్ పిలుపుతో.. అనాథలకు నిఖిల్ అభిమానులు భోజనాలు ఏర్పాటు చేశారు. అనాథ పిల్లల మధ్య హీరో నిఖిల్ కేక్ కట్ చేసి వారితో కొంతసమయం సంతోషంగా గడిపారు. కరోనా పై తీసుకోవాల్సని జాగ్రత్తలను వారికి తెలిపారు.
అనాథ శరణాలయంలో హీరో నిఖిల్ పుట్టినరోజు వేడుకలు - అనాధ శరణాలయంలో హీరో నిఖిల్ పుట్టిన రోజు వేడుకలు
నిఖిల్ తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. అనాథ శరణాలయంలో నిరాశ్రయులతో కాసేపు సంతోషంగా గడిపారు. వారికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు.
అనాధ శరణాలయంలో హీరో నిఖిల్ పుట్టిన రోజు వేడుకలు