ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టినరోజున ఉదారతను చాటుకున్న మంచు మనోజ్ - శ్రీకాకుళం వలస కార్మికులకు మంచు మనోజ్ సాయం వార్తలు

తన తల్లి కోరిక మేరకు ఉదారతను చాటుకున్నాడు యువ కథానాయకుడు మంచు మనోజ్​. తెలంగాణాలో హైదరాబాద్​ మూసాపేటలో ఉంటున్న శ్రీకాకుళం వలస కార్మికులను రెండు బస్సుల్లో స్వస్థలలాకు పంపించాడు. తన పుట్టినరోజు సందర్భంగా సొంత ఖర్చులతో ఈ పని చేస్తున్నట్లు తెలిపాడు. ఇళ్లకు చేరేవరకు తన మనుషులు సాయంగా ఉంటారని కూలీలకు భరోసా ఇచ్చాడు మనోజు.

hero manchu manoj
వలస కార్మికులను స్వస్థలాలకు పంపిన మంచు మనోజ్​

By

Published : May 20, 2020, 11:31 PM IST

తన తల్లి సంతోషం కోసం తెలంగాణాలోని హైదరాబాద్​లో చిక్కుకున్న వలస కూలీలను సొంత ఖర్చులతో స్వస్థలాలకు పంపిస్తున్నట్లు కథానాయకుడు మంచు మనోజ్ తెలిపాడు. తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ మూసాపేటలో ఉంటున్న ఏపీ శ్రీకాకుళం వలస కూలీలను రెండు బస్సులు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించాడు.

ఇళ్లకు చేరేవరకు తన మనుషులు సాాయంగా ఉంటారని కూలీలకు భరోసానిచ్చిన మనోజ్... వలస కూలీల కుటుంబాలకు మాస్క్​లు, శానిటైజర్స్ అందజేసి సాగనంపాడు. వ్యక్తిగతంగా తాను ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నాడు. సామాజిక బాధ్యతగా అందరు ముందుకువచ్చి సాటి మనుషులకు సహాయపడాలని మనోజ్​ విజ్ఞప్తి చేశాడు.

ఇదీ చూడండి :'ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా!'

ABOUT THE AUTHOR

...view details