లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు కోరారు. ఐఎస్సీయూఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన ఐక్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల వారికి అందిస్తున్న నగదు సహాయాన్ని కళాకారులకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్లను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఉపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలి' - విజయవాడ నేటి వార్తలు
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు కోరారు. లబ్ధిదారులకు ఇచ్చే పింఛన్లను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలో ఐఎస్సీయూఎఫ్ సమావేశం