ఉగ్రరూపం దాల్చిన మున్నేరు... కొనసాగుతున్న వరద - krishna district latest updates
కృష్ణాజిల్లాలో మున్నేరు వాగు ఉద్ధృతి కొనసాగుతోంది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని లింగాల, పెనుగంచిప్రోలు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది.
![ఉగ్రరూపం దాల్చిన మున్నేరు... కొనసాగుతున్న వరద heavy water in munneru estuary at krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8437083-93-8437083-1597553540745.jpg)
తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు పొంగిపొర్లుతోంది. శనివారం అర్ధరాత్రి నుంచి నదిలో నీటి ప్రవాహం లక్ష క్యూసెక్కులకు పెరగటంతో కృష్ణాజిల్లాలోని లింగాల, పెనుగంచిప్రోలు వంతెనపై నీటి ప్రవాహం కొనసాగుతోంది. తెలంగాణకు పూర్తిగా రవాణా మార్గం మూసుకుపోయింది. మున్నేరు పరీవాహకంలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు నందిగామ, చందర్లపాడు మండలాల పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై నది పరివాహక గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలను ఎవరూ దాటకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. వత్సవాయి మండలంలోని లింగాల, ఆలూరుపాడు, పెనుగంచిప్రోలు మండలంలోని ముచ్చింతల, అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలు, గుమ్మడిదుర్రు గ్రామాల్లో వందల ఎకరాల్లోని భూములు నీట మునిగాయి.