ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎగువన ఏకధాటి వర్షాలు.. మున్నేరుకు ముంచెత్తుతున్న వరద - muneru river water flow update

గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలోని మున్నేరు వాగుకు భారీగా వరద నీరు వస్తోంది. అధికారులు కాల్వలకు సాగునీరు విడుదల చేశారు. నల్లవాగుకూ వరద భారీగా చేరుతోంది.

heavy water flow coming into muneru
మునేరుకు ముంచెత్తుతున్న వరద

By

Published : Jul 16, 2020, 12:06 AM IST

తెలంగాణలో జోరుగా వర్షాలు పడుతున్న కారణంగా.. మున్నేరుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నందిగామ, కీసర మీదుగా మున్నేరు నీరు కృష్ణా నదిలో కలుస్తోంది. సకాలంలో నీరు రావటం వల్ల మున్నేరు కాల్వలకు సాగునీరు విడుదల చేశారు.

పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ మండలాల పరిధిలోని 18 వేల ఎకరాల్లో వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నారుమడులు పోసిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు నందిగామ మండలం చందూపురం వద్ద నల్లవాగుకు భారీగా వరద నీరు వస్తుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details