ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పండగొచ్చింది.. టోల్​గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్​ జామ్​ - latest news on sankranti traffic

పండుగ కోసం హైదరాబాద్​ నుంచి స్వస్థలాలకు బయల్దేరిన ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. టోల్​ప్లాజాల వద్ద భారీగా వాహనాలు చేరుకోవటంతో గంటల తరబడి ట్రాఫిక్​ స్తంబించింది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

heavy traffic in vijayawada root
కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్

By

Published : Jan 12, 2020, 2:24 PM IST

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్​లో ఉంటున్న చాలామంది పల్లెబాట పట్టారు. తమ స్వగ్రామంలో పండుగ జరుపుకునేందుకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో రోడ్లపైకీ భారీగా వాహనాలు చేరుకున్నాయి. ఒకేసారి వాహనాలు బయటకు రావడంతో టోల్​గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కీసర టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్

ABOUT THE AUTHOR

...view details